ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూలై 11, 2025
స్ట్రీమింగ్ వేదిక : నెట్‌ఫ్లిక్స్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : మాధవన్, ఫాతిమా సనా షైక్, ఆయేషా రాజా, మనీష్ చౌదరి, నమిత్ దాస్
దర్శకత్వం : వివేక్ సోనీ
నిర్మాతలు : కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అదార్ పూనవాలా, సోమెన్ మిశ్రా
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్, రోచక్ కోహ్లీ
సినిమాటోగ్రఫీ : డెబోజీత్ రే
ఎడిటింగ్ : ప్రశాంత్ రామచంద్రన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
రీసెంట్ గా ఓటిటిలో నేరుగా స్ట్రీమింగ్ కి వచ్చిన చిత్రాల్లో “ఆప్ జైసా కోయి” కూడా ఒకటి. అయితే నటుడు మాధవన్, దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షైక్ నటించిన ఈ రోమ్ కామ్ డ్రామా ఎలా వుందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ:
తన చిన్నప్పుడే ఒకమ్మాయికి ప్రపోజ్ చేసినపుడు ఆమె పెట్టిన శాపం వల్ల శ్రీరేణు త్రిపాఠి (మాధవన్) 40 ఏళ్ళు వచ్చినప్పటికీ పెళ్లి కాకుండా వర్జిన్ లా మిగిలిపోతాడు. ఒక స్కూల్ లో సంస్కృతం టీచర్ గా పని చేసే శ్రీ పెళ్లి కోసం అలా ఎదురు చూస్తూ ఒక ఆడ తోడు కోసం తహతహలాడుతాడు. ఈ సమయంలో తన ఫ్రెండ్ ఆప్ జైసా కోయి అనే డేటింగ్ యాప్ కోసం చెప్తాడు. అందులో పరిచయం అయ్యిన ఒకమ్మాయితో మొదటి ఫోన్ కాల్ మాటల్లో శ్రీ లైఫ్ లో కొత్త చాప్టర్ మొదలైంది అనుకుంటాడు. ఇలా కొన్ని రోజులు సాగిన తర్వాత ఒక పెళ్లి సంబంధం తన కుటుంబం నుంచి వస్తుంది. అలా వచ్చిన సంబంధమే మధు బోస్ (ఫాతిమా సనా షైక్) ఆమెకి కూడా 30 ఏళ్ళు దాటి ఉంటాయి. మరి ఇలా వచ్చిన సంబంధం నుంచి ఇద్దరి లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది కానీ సరిగ్గా పెళ్ళికి ముందు మధు కోసం శ్రీ ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు. మరి ఆ నిజం ఏంటి? విడిపోయిన ఇద్దరూ కలిసారా లేదా? ఈ సినిమాతో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాలి.
ప్లస్ పాయింట్స్:
నిజానికి ఈ సినిమాలో చాలా సింపుల్ కథనమే ఉంటుంది కానీ ఉన్న కథనం కూడా బ్యూటిఫుల్ గా చెక్కినట్టు కొనసాగుతుంది. ఒక పక్క మంచి ఫన్ ఇంకో పక్క ఎమోషన్స్ తో డీసెంట్ గా వెళుతుంది. నటుడు మాధవన్ కోసం తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలుసు. రీసెంట్ గా తన నుంచి వచ్చిన సినిమాలకి ఇది పూర్తిగా భిన్నం.
తన ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలో తన పాత్రని అంతకు మించి తన రోల్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. తన పాత్రలోని అమాయకత్వం, తన హావభావాలు ఎంతో చక్కగా ఉంటాయి. దాదాపు మొదటి సగం కథనం అంతా కూడా ఆడియెన్ పెద్దవిగా చిరు నవ్వు కోల్పోకుండానే కొనసాగుతుంది. ఆ రేంజ్ లో మాధవన్ తన పాత్రలో ఇమిడిపోయారు.
ఇంకా ఫాతిమా సనా షైక్ ఈ సినిమాలో మరో స్టార్ అని చెప్పొచ్చు. రియల్ లైఫ్ లో కూడా ఇద్దరికీ బాగా ఏజ్ గ్యాప్ ఉంటుంది. కానీ స్క్రీన్ పై వీరి జంట తాలూకా పాత్రల్లో బాగా కనిపించారు. చక్కటి కెమిస్ట్రీ, ఇద్దరి నడుమ ప్రేమ సన్నివేశాలు, కలహాలు బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. అలాగే ఫాతిమా చాలా అందంగా కూడా కనిపించింది. గ్లామర్ తో పాటుగానే నటన పరంగా కూడా బాగా చేసింది.
అలాగే ఈ సినిమా ఒక ఇంచు మహిళలకి బాగా కనెక్ట్ కావచ్చు. ప్రెజెంట్ జెనరేషన్ లో ఒక స్త్రీ మగవారి నుంచో లేదా తమ జీవిత భాగస్వామి నుంచో ఏం కోరుకుంటున్నారు? వారి ఆలోచనా విధానం, అది వారి మానసిక లేదా శారీరిక అంశాల్లో అయినా కూడా ఎలా ఉంటున్నారు అనేది రిప్రెజెంట్ చేసినట్టు చూపించారు. సో ఈ అంశాలు ఖచ్చితంగా వారికి కనెక్ట్ అవుతాయి.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో చాలా సింపుల్ లైన్ నే చూపించారు. ఒక మిడిల్ ఏజ్ పెళ్లి కాని వర్జిన్ అబ్బాయి తనకి పెళ్లి ఆ సమయంలో వచ్చిన అమ్మాయి ఆ తర్వాత ఏం జరిగింది అనే లాంటివి ఇది వరకే చూసాం అనిపిస్తుంది కానీ ఇందులో అంతకు మించి మహిళా సాధికారిక చూపించే ప్రయత్నం చేశారు.
అయితే ఈ ప్రయత్నం కొంతమేర ఓకే కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఆడవాళ్ళూ మగవాళ్ళు సమానమే అనే పాయింట్ తో అందరూ ఏకీభవించాలని లేదు. కానీ ఈ సినిమాలో దర్శకుడు కొన్ని అంశాలు చెప్పిన విధానం మగవారి (కొందరు) మనోభావాలని దెబ్బ తీసేలా అనిపించవచ్చు.
అలాగే కథనం కొంచెం స్లో పేస్ లో కొనసాగుతుంది. ఇది కొంచెం స్పీడప్ చేయాల్సింది. అయితే దర్శకుడు స్కోప్ అంతా ఆడవారి కోణంలోనే పాజిటివ్ గా తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది. కానీ మగవారి కోణంలో కూడా వారిని సాటిస్ఫై చేసే స్కోప్ ఉంది అందుకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు యాడ్ చేసి ఉంటే తాను ఇద్దరూ సమానమే అని చెప్పాలనుకున్న పాయింట్ కేవలం ఒక్క జెండర్ వైపే ఉన్నట్టు అనిపించకుండా ఇద్దరి వైపు సమానంగా ఉంది అనిపించేది. ఈ ఇది మిస్ చేశారు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. కరణ్ జోహార్ చాలా కాలం తర్వాత తన నిర్మాణంలో ఒక డీసెంట్ రోమ్ కామ్ డ్రామాని తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకి రాధే శ్యామ్, డియర్ కామ్రేడ్ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి. ఫాతిమాపై సాంగ్స్ మరింత బాగున్నాయి. అలాగే దెబోజీత్ రే ఇచ్చిన సినిమాటోగ్రఫీ బాగుంది. తాను బంధించిన విజువల్స్ సినిమా మూడ్ కి తగ్గట్టుగా బాగున్నాయి. ప్రశాంత్ రామచంద్రన్ ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది ఫస్టాఫ్ ని కొంచెం ఫాస్ట్ గా నడిపి ఉంటే బాగుండేది. తెలుగు డబ్బింగ్ బాగుంది.
ఇక దర్శకుడు వివేక్ సోని విషయానికి వస్తే.. తాను ఒక ఎంటర్టైనింగ్ రోమ్ కామ్ డ్రామాని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇందులో ఆడ – మగ ఇద్దరు సమానమే అని చెప్పే ప్రయత్నం ఇద్దరికీ సమాన స్కోప్ ఇవ్వడం మాత్రం మిస్ చేసినట్టు అనిపిస్తుంది. సినిమాలో కనిపించే మహిళా పాత్రలకి పూర్తి న్యాయం చేకూర్చారనే అనుకున్నప్పటికీ ఇదే తరహాలో పురుష పాత్రలకి కూడా చేసి ఉంటే కంప్లీట్ గా ఉండేది. ఇది మినహాయిస్తే ఈ రోమ్ కామ్ సినిమాలో తన వర్క్ బాగుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఆప్ జైసా కోయి” ఒక డీసెంట్ రోమ్ కామ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. మంచి ఫన్ బ్యూటిఫుల్ కథనం, అంతకు మించి మాధవన్ క్యూట్ పెర్ఫామెన్స్, ఫాతిమా గ్లామర్ ఆమె నటన కూడా బాగున్నాయి. అయితే ఒక మెట్టు మహిళలకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది కానీ దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ కొంచెం బ్యాలన్స్ మిస్ అయ్యింది. ఇది కూడా కరెక్ట్ గా ఉండి ఉంటే బాగుంది. అయినప్పటికీ ఒక సింపుల్ ఎంటర్టైనర్ గా ఈ వీకెండ్ లో ఓటిటిలో సినిమాని చూడొచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team