అతడు సాటిలైట్ హక్కులను పొడిగించుకున్న ‘మా’


ప్రిన్స్ మహేష్ బాబు రేంజ్ ని అమాంతం ఒకే సారి పెంచేసిన సినిమా అతడు. అప్పటి వరకు మూసగా వస్తున్న యాక్షన్ సినిమాలతో బోర్ కొట్టిన తెలుగు ప్రేక్షకులకి విందు భోజనం లాంటి ప్రేక్షలకు అందించారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ చిత్ర మొదటి ఆరు సంవత్సరాలకు గాను సాటిలైట్ హక్కులను మా టీవీ వారు దక్కించుకున్నారు. ఆ గడువు ఈ నెలాఖరుతో పూర్తయింది. ఆ హక్కులను మళ్లీ వచ్చే ఆరు సంవత్సరాలకు గాను పొడిగించుకోవడానికి దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమాకి ఇప్పటికీ ప్రజాదరణ తగ్గలేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అతడు సినిమాలో మహేష్ సరసన త్రిషా నటించగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళి మోహన్ నిర్మించారు.

Exit mobile version