‘క్రేజీ వాలా’ గా మారనున్న ఎంఎస్ నారాయణ

crazywala

కమెడియన్ ఎంఎస్ నారాయణ త్వరలో హీరో అవతారం ఎత్తబోతున్నాడు. ‘క్రేజీ వాలా’ అనే కామెడీ సినిమాలో కథానాయుకుడుగా మారనున్నాడు. ఈ సినిమా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ మిద వస్తున్న ఓ కామెడీ సినిమా.

మన్నే గోవర్ధన్ రెడ్డి సమర్పణలో వస్తున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి నిర్మాతలు విజయ్ కుమార్ గౌడ్, మోహన్ ప్రసాద్ మరియు ఎం రమేష్ బాబు.

ఒక్కే షెడ్యూల్ లో పూర్తి చేసుకునే ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో ఎంతో మంది రాజకియనయకులని అనుకరించిన ఎంఎస్ నారాయణ అరవింద్ కేజ్రివాల్ పాత్రలో కూడా అలరిస్తాడని ఆశిద్దాం.

Exit mobile version