అదృష్టం ఒక్కటే విజయాలను తెచ్చిపెట్టదు : తాప్సీ

అదృష్టం ఒక్కటే విజయాలను తెచ్చిపెట్టదు : తాప్సీ

Published on Aug 29, 2012 12:58 PM IST


పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ ఈ సంవత్సరం వెంకటేష్ తో నటిస్తున్న ‘షాడో’ మరియు లక్ష్మీ మంచు నిర్మిస్తున్న’ గుండెల్లో గోదారి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడటానికి చాలా సున్నితంగా కనిపించే ఈ భామ మనసులో మాత్రం చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. ‘ మన ఇండస్ట్రీలో అదృష్టం అనే పదానికి ఎక్కువ విలువనిస్తారు. అదే నటీనటుల భవిష్యత్తును నిర్దేశిస్తుందని భావిస్తారు. ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఒక్క సినిమా నటుడి యొక్క ఫేట్ ని మార్చేస్తుంది అది నిజమే, కానీ ఆ తర్వాత కష్టపడి పనిచేస్తేనే భవిష్యత్తులో విజయం సాదిస్తారని’ ఆమె అన్నారు.

అలాగే ఆమె మాట్లాడుతూ ‘ నాకు కూడా సినిమాల్లోకి రాకక ముందు ఒక్క డాన్స్ తప్ప నటన గురించి ఏమీ తెలియదు. నేను నటిని అయిన తర్వాతే ఒక్కొక్క విషయం నేర్చుకుంటున్నాను. ఒక నటుడికి ఎన్ని సినిమాలు చేసినా నేర్చుకోవాల్సింది ఇంకా ఉంటుంది, ఎందుకంటే నటన అనే కళ ఒక సముద్రం లాంటిందని’ ఆమె అన్నారు.

భవిష్యత్తులో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి ప్రేక్షకుల మెప్పును పొందాలని కోరుకుందాం.

తాజా వార్తలు