పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో క్రిష్ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈరోజే మొదలుకానుంది. మొదటి నుండి తెలుస్తున్న వివరాల ప్రకారం ఇదొక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రమని, మొగలుల కాలంలో నడిచే కథని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నారు.
ఇదొక తిరుగుబాటుదారుని కథే అయినా ఈ కథకి మూలం కథానాయకుడి ప్రేమకథట. ఆ ప్రేమకథ చుట్టూనే మిగతా కథ అల్లుకుని ఉంటుందట. క్రిష్ గత చిత్రాలు చూసుకుంటే అన్నిటిలోనూ మంచి ప్రేమకథలుంటాయి. అలాగే ఇందులో కూడా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉండనుంది. ఇందులో పవన్ మార్క్ ఎంటర్టెయిన్మెంట్, యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలంగా ఉండనున్నాయి. వీలైనంత త్వరగా సినిమా చిత్రీకరణను ముగించి జూలై నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.