లవ్ ఫెయిల్యూర్ తూర్పు గోదావరి జిల్లా కలెక్షన్స్

లవ్ ఫెయిల్యూర్ తూర్పు గోదావరి జిల్లా కలెక్షన్స్

Published on Feb 26, 2012 10:59 AM IST

సిద్ధార్థ్ మరియు అమలా పాల్ నటించిన ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు మల్టిప్లెక్స్ ఆడియెన్స్ మనసు గెలుచుకున్న విషయం తెల్సిందే. హైదరాబాద్, విజయవాడ మరియు వైజాగ్ లలో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. మా విశ్వసనీయ వర్గాల సమాచారం తూర్పు గోదావరి జిల్లాకు గాను ఈ చిత్రం 4 లక్షల రూపాయలు షేర్ దక్కించుకుంది. ఫైనల్ రన్ లో మరో లక్ష వరకు వసూలు చేయొచ్చని ఆశిస్తున్నారు. ఈ చిత్రం అన్ని వరగాల ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని తీసింది కాకపోయినా విమర్శకుల మనసు గెలుసుకొని అర్బన్ సిటీలలో వస్తున్న కలెక్షన్స్ తో సిద్ధార్థ్ సంతోషంగా ఉన్నాడు. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ తో ఈ చిత్రం సేఫ్ జోన్లో పడింది. ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించగా సిద్ధార్థ్ నిర్మాతగా మొదటి చిత్రం.

తాజా వార్తలు