తన స్టార్ట్ చేసిన కొన్నాళ్లకే మంచి స్టార్డం అందుకున్న టాలెంటెడ్ దర్శకుల్లో తమిళ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. తన మానగరం, ఖైదీ ఇంకా విక్రమ్ సినిమాలతో ఆడియెన్స్ కి పీక్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించిన లోకేష్ ఇపుడు ఒకొక్క సినిమాతో తన బ్రాండ్ వాల్యూ తగ్గించుకుంటున్నాడు.
లియో సినిమాకే తన వర్క్ పై గట్టి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దీనితో తన కెరీర్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం “ఖైదీ 2” కోసం అంతా ఎదురు చూస్తున్న సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ అనౌన్స్ చేసాడు. ఓకే రజిని తోనే కదా అని అంతా ఎగ్జైట్ అయ్యి ఖైదీ కి అందాక బ్రేక్ ఇచ్చారు కానీ కూలీ కూడా లియో తరహా లోనే సరైన టాక్ కి నోచుకోలేదు.
ఇక ఇప్పటికి అయినా లోకి తనకి ఫామ్ అండ్ ఫేమ్ ఇచ్చిన ఖైదీ 2 చేస్తేనే మొత్తం సెట్టవుతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు కానీ ఇప్పుడు ఖైదీ 2 కి మళ్ళీ బ్రేక్ ఇచ్చి లోకేష్ మిస్టేక్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. కూలీ ప్రమోషన్స్ లో కూడా ఈ తర్వాత చేసే సినిమా ఖైదీ 2 అనే చెప్పినప్పటికీ ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి టాక్ షాకిచ్చింది.
కూలీ తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ లని పెట్టి ఓ భారీ మల్టీస్టారర్ చేసే యోచనలో లోకేష్ ఉన్నట్టుగా ఇపుడు వచ్చిన టాక్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. దీనితో లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లో సినిమాలే చేసుకుంటే బాగుంటుంది అని మళ్ళీ ఆ మిస్టేక్ వద్దని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి లోకేష్ నెక్స్ట్ ఏంటి అనేది అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చే వరకు అయితే తేలేలా లేదు.