నాగ్ తో అంత ఈజీ కాదు.. లోకేష్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

నాగ్ తో అంత ఈజీ కాదు.. లోకేష్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jul 15, 2025 9:59 AM IST

ప్రస్తుతం తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్ మంచి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “కూలీ” అనే చెప్పాలి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరక్కేకించిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామాలో కింగ్ నాగార్జున కూడా మంచి ఇంటెన్స్ పాత్ర చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో నాగ్ ని గత 40 ఏళ్లలో చూపించని కొత్త వెర్షన్ లో చూస్తారని ఆ మధ్య కుబేర ప్రమోషన్స్ లో నాగ్ తెలిపారు. అలాగే ఇప్పుడు లోకేష్ కనగరాజ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. నాగ్ సర్ ని ఒప్పించడం అంత తేలిక కాదని చెబుతున్నాడు. తన పాత్రపై ఐడియా ఆయనకి ఎంతో నచ్చింది అన్నారు కానీ దానిని తీర్చిదిద్దడం మాత్రం సవాలుగా మారిందని లోకేష్ అంటున్నాడు.

దగ్గరకి ఏడెనిమిది సార్లు నాగ్ కి నరేషన్ ని ఇచ్చినట్టు తాను తెలిపాడు. దీనితో తనని మాత్రం ఒప్పించడం ఒకింత కష్టమే లోకేష్ తెలిపాడు. దీనితో నాగ్ ఛాయిస్ అండ్ క్లారిటీ విషయంలో ఎలా ఉంటారు అనేది వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు