తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘కూలీ’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు లోకేష్ రెడీ అవుతున్నాడు. అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న లోకేష్, ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు.
ఆయన కొంతకాలం వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కూలీ చిత్ర ప్రమోషన్స్ వరకు తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని పేర్కొన్నాడు. అన్నట్లుగానే ఆయన ఇప్పుడు కూలీ ప్రమోషన్స్‌ను చేస్తున్న తరుణంలో తిరిగి సోషల్ మీడియాలోకి వచ్చారు.
తాజాగా ఆయన చదువుకున్న కాలేజీ రూమ్‌లో కూర్చుని సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైందని ఆయన ఈ ఫోటోకు ట్యాగ్ ఇచ్చాడు. దీంతో కాలేజీ రోజుల నుంచే లోకేష్‌కు సినిమాలపై ఎంతటి మక్కువ ఉందో అర్థమవుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.