పవన్ ప్లాన్స్ ఖరాబ్ చేసిన లాక్ డౌన్..!

పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలు ప్రకటించి ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. అందులో పింక్ తెలుగు రిమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ కూడా చివరి దశకు చేరింది. అనుకున్న ప్రకారం అన్నీ కుదిరితే ఈనెలలో వకీల్ సాబ్ థియేటర్స్ లో సందడి చేశేవాడు. ఇక ఏఎమ్ రత్నం నిర్మాతగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ కూడా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. పాలిటిక్స్ లో కూడా చురుకుగా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ అటు సినిమాలు,ఇటు పాలిటిక్స్ డిస్టర్బ్ కాకుండా డేట్స్ ఇవ్వడం జరిగింది. ఐతే లాక్ డౌన్ కారణంగా పవన్ కళ్యాణ్ ప్రణాళిక మొత్తం తారుమారు అయ్యింది.

పవన్ నటిస్తున్న సినిమాల విడుదల పోస్ట్ ఫోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వకీల్ సాబ్ సమ్మర్ నుండి దసరాకు షిఫ్ట్ కానుందట. క్రిష్ తో చేస్తున్న మూవీని కూడా 2020లోనే విడుదల చేయాలన్నది అసలు ప్లాన్. షూటింగ్ అనుకున్న ప్రకారం జరగని కారణంగా వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇలా పవన్ ప్రణాళిక మొత్తం లాక్ డౌన్ డిస్టర్బ్ చేసింది.

Exit mobile version