లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్

లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్

Published on Jun 15, 2013 3:30 AM IST

Allu-Arjun-and-Lingu-sami
ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగే సినిమా కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ ఎన్ లింగుస్వామితో జతకట్టనున్నాడు. లగడపాటి శ్రీధర్ తన పుట్టినరోజు సందర్భంగా ఎనిమిదవ సినిమాగా ఈ అల్లు అర్జున్ – లింగుస్వామిల సినిమాను ప్రకటించాడు. నటుల పేర్లు బహిరంగంగా తెలపకపోయినా అతను అల్లు అర్జున్ యే తన సినిమాలో హీరో అని తగినన్ని సూచనలు ఇచ్చాడు.

ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ కూడా తాను ఒకరిద్దరు తమిళ డైరెక్టర్లతో చర్చలలో ఉన్నాడని తెలిపాడు. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా తెలుపలేదు. కేరళలో తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకున్న అల్లు అర్జున్ ను చాలామంది ఒక తమిళ సినిమాలో నటించమని కోరుతున్నారట. లింగుస్వామితో తీస్తున్న సినిమా ద్విభాషాచిత్రంగా రాబోతుంది. మరి మన డైరెక్టర్ హీరోకోసం ఏ కధ రాస్కున్నాడో??

గతంలో లింగుస్వామి ‘వెట్టాయ్’, ‘పైయా’ సినిమాలను తీసాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. రామ లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్ మరియు శిరీష ఈ సినిమాను నిర్మిస్తారు.

తాజా వార్తలు