లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ‘మా’

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ‘మా’

Published on Jul 23, 2012 1:08 PM IST


‘లీడర్’ చిత్రం విడుదలైన చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ” లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ “. నూతన నటీ నటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర పోస్టర్లకు మరియు ఫస్ట్ టీజర్ కి ప్రేక్షకులనుంచి మంచి స్పందన లబిస్తోంది. తాజాగా ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను మా టివి దక్కించుకుంది. ఎంతకి ఈ చిత్ర రైట్స్ దక్కించుకున్నారు అనే విషయం ఇంకా తెలియలేదు, సినిమాకి ఉన్న అంచనాలను బట్టి ఒక ఫాన్సీ అమౌంట్ కే మా టివి దక్కించుకొని ఉంటుందని భావిస్తున్నాం. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను జూలై 27న విడుదల చేయనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఆద్వర్యంలో ఒక కోటి రూపాయలతో ఒక కాలనీ సెట్ వేశారు. విజయ్ సి కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.

తాజా వార్తలు