సెన్సార్ జరుపుకుంటున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు సాయంత్రం కల్లా సెన్సార్ వారు ఈ చిత్రానికి ఏమి సర్టిఫికేట్ ఇచ్చారో తెలిసిపోతుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని అమల, శ్రియ మరియు అంజలి జావేరిలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version