లెజెండ్ టిజర్ కి అద్భుతమైన స్పందన

legend1

బాలకృష్ణ తాజా చిత్రం ‘లెజెండ్’ ఇంటర్నెట్ లో అలజడి సృష్టిస్తుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆడియో టిజర్ ఈరోజు విడుదల అయింది. విడుదల అవ్వగానే బాలకృష్ణ అభిమానులు పండగ చేసుకున్నారు. బాలకృష్ణ పవర్ ఫుల్ గెట్ అప్ నుంచి దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు అన్నిటికి మంచి స్పందన లభిస్తుంది.

ఇప్పుడు అందరి కళ్ళు మార్చి 7 న హైదరాబాద్ లో జరగనున్న ఆడియో రిలీజ్ పై పడ్డాయి. దేవి మొదటిసారి బాలకృష్ణ చిత్రానికి సంగీతం కుదిర్చాడు. ఈ సినిమా పై అంచనాలు ఇప్పటికే తారా స్థాయికి చేరుకున్నాయి. ఆడియో టిజర్ ఈ చిత్ర సంగీతం అదిరిపోనుందని తెలుపుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరిదశలో వుంది. ప్రస్తుతం బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, హంస నందినిలపై ఒక పాటని అన్నపూర్ణ 7 ఏకర్స్ లోని ఒక ప్రత్యేక సెట్ లో చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రంలో బాలకృష్ణ సోనాల్ చౌహాన్ జగపతిబాబులతో పాటు రాధిక ఆప్టే ముఖ్య పాత్ర పోషిస్తుంది. జగపతిబాబు ఒక పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి సమర్పిస్తున్నారు అనిల్ సుంకర గోపీచంద్ రామ్ ఆచంట నిర్మిస్తున్నారు.

Exit mobile version