నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘లెజెండ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రధాన నటీనటులతో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ షూట్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీని వారాహి చలన చిత్రం – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ గా మరియు స్టైలిష్ లుక్ లో కూడా కనిపించనున్నారని సమాచారం. మేము నిన్న చెప్పినట్లు బాలకృష్ణ ఈ సినిమాకోసం బాగా ఫిట్ గా తయారయ్యారు. 2014 మొదట్లో లెజెండ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రా