ట్రైలర్ విడుదలైన నాటినుండి నందమూరి బాలకృష్ణ లెజెండ్ సినిమా ప్రచారం ఊపందుకుంది. యుట్యూబ్ లో లక్షల కొలదీ హిట్లను అందుకున్న ఈ వీడియో అభిమానులకు సినిమాపై అంచనాలను పెంచేసింది. నిర్మాతలకు ఈ సినిమా ద్వారా మంచి లాభాలు అందుతున్నాయి. ఇప్పటికే నైజాం, సీడెడ్ మరియు గుంటూరు హక్కులు మంచి ధరకు అమ్ముడయిపోయాయి
బాలయ్య బాబు సినిమాలలోకేల్లా ఈ లెజెండ్ మంచి ప్రీ- రిలీజ్ బిజినెస్ చేసిందని టాక్. రాధిక ఆప్టే మరియు సోనాల్ చౌహన్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు.
.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి