రేపు రానున్న ‘లెజెండ్’ ఆడియో టీజర్

legend1
నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ మూవీ ఆడియో టీజర్ ని అభిమానులకి స్పెషల్ ట్రీట్ గా రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు.మొదటిసారి యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ బాలకృష్ణ సినిమాకి మ్యూజిక్ అందించాడు. కొద్ది సేపటి క్రితమే కొత్త ఆడియో పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో బాలకృష్ణతో పాటు రాధిక ఆప్టే కూడా ఉంది.

రాధిక ఆప్టే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాకి సోనాల్ చౌహాన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో జగపతిబాబు విలన్ గా కనిపించనున్నాడు. బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం వారు కలిసి నిర్మంచారు.

Exit mobile version