లారెన్స్ కి మెగాస్టార్ మరియు సూపర్ స్టార్ తో ఏంటి కనెక్షన్?


కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీకి వచ్చిన రాఘవ లారెన్స్ ఆ తరువాత నటుడిగా, డైరెక్టర్ గా తన హవా కొనసాగిస్తున్నాడు . లారెన్స్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు మెగాస్టార్ చిరంజీవిలతో మంచి రిలేషన్ ఉంది. ఆయన కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా సక్సెస్ కావడానికి కారణం వారే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రెబల్’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో లారెన్స్ మాట్లాడుతూ ‘ పబ్లిక్ పల్స్ నాకు తెలుసు, ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో నాకు తెలుసు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూస్తారో నేను సూపర్ స్టార్ రజినీకాంత్ దగ్గర నుండి నేర్చుకున్నాను అలాగే డాన్సుల గురించి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్నాను. ఆ రెండు విషయాల గురించి వారి కన్నా తెలిసిన వారు ఉన్నారా! అని’ ఆయన అన్నారు.

లారెన్స్ చెప్పింది నిజమని ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే రజినీకాంత్ మరియు చిరంజీవిలతో లారెన్స్ కి మంచి సంభందాలు ఉన్నాయి. చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమా 100 రోజుల వేడుకలో ‘వీణ స్టెప్’ కంపోస్ చేసినందుకు లారెన్స్ కి చిరు ఒక ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు.

లారెన్స్ తీసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర హిట్ గా నిలిచాయి. తన దర్శకత్వంలో చివరిగా వచ్చిన ‘కాంచన’ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కి సెప్టెంబర్ 28న విడుదలకు సిద్దమవుతున్న ‘రెబల్’ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version