డిసెంబర్లో మొదలు కానున్న లారెన్స్ ముని 3


రాఘవ లారెన్స్ “ముని” చిత్ర మూడవ భాగాన్ని డిసెంబర్లో మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రం మొదటి భాగం 2007లో విడుదల అయ్యింది. ఈ చిత్రం అప్పట్లో పరవాలేదు అనిపించింది కాని దీనికి కొనసాగింపుగా వచ్చిన “కాంచన” బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. “కాంచన” చిత్ర విడుదల అయిన వెంటనే రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో మరో భాగం కోసం కథ రాస్తున్నట్టు ప్రకటించారు. కాని తరువాత అయన ప్రభాస్ హీరోగా “రెబల్” చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం అయన “ముని 3” చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా అయన ఎంతో అభిమానించే రజనీకాంత్ కి అంకితం ఇస్తూ ఒక పాటను లారెన్స్ డిసెంబర్ 12న విడుదల చెయ్యనున్నారు. ఈ పాటకు విజయ్ అంథోని సంగీతం అందించారు.

Exit mobile version