విశ్వరూపం చూపించడానికి సిద్దమవుతున్న లారెన్స్

Raghava_Lawrence11
‘కాంచన’ సినిమాలో రాఘవ లారెన్స్ చేసిన నటన మీకు బాగా నచ్చిందా, అయితే లారెన్స్ ప్రస్తుతం తీస్తున్న ‘ముని 3’ సినిమాలో గత రెండు సినిమాల కంటే ఎక్కువగా భయపెట్టే సీన్స్, అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో వచ్చే దెయ్యం 6 గెటప్స్ లో కనిపించనుంది. ‘కాంచన’ లో లారెన్స్ పాత్రలోకి దెయ్యం ప్రవేశించగానే అతని గెటప్ పూర్తిగా మారిపోతుంది. ఈ సినిమా ద్వారా లారెన్స్ తన విశ్వరూపం చూపిస్తాడని అందరూ అంటున్నారు. ఇటీవలే చెన్నైలో ఈ సినిమాకి సంబందించిన ఒక లాంగ్ షెడ్యూల్ పూర్తయ్యింది. తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Exit mobile version