టాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాల రిలీజ్ కి కనిపిస్తోన్న ఏకైక సీజన్ సంక్రాంతి. పెద్ద సినిమాలతో పాటు చిన్నాచితకా చిత్రాలు కూడా ఈ సీజన్ నే నమ్ముకున్నాయి. అందులో భాగంగా మంచు విష్ణు హీరోగా వస్తోన్న ‘మోసగాళ్లు’ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ముందు అనుకున్న మిగిలిన సినిమాలు అన్ని సంక్రాంతికి వస్తే.. వాటితో పాటే పోటీగా ‘మోసగాళ్లు’ కూడా రిలీజ్ అవుతుందా ? లేక పోటీ ఎందుకు అని పోస్ట్ ఫోన్ అవుతుందా అనేది చూడాలి.
కాగా ఈ మూవీలో విష్ణుతో పాటు అందాల తార కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. పైగా సినిమాలో కాజల్, విష్ణుకి సిస్టర్ గా నటిస్తోంది. సినిమాలో విష్ణు పోషిస్తున్న క్యారెక్టర్ చాలా ఇన్టెన్స్ గా ఉంటుందట. టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టితో పాటు నవదీప్, నవీన్ చంద్ర వంటి పేరుపొందిన యాక్టర్లు కూడా నటిస్తోన్నారు.