‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బన్నీ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారని.. ముఖ్యంగా బన్నీ రెండో పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ చాలా బలంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా బన్నీ రెండో పాత్ర లుక్ ను కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశాడట.
కాగా ఈ సినిమాలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించనున్న మిగిలిన నటీనటుల గురించి కూడా అప్ డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.