‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్డేట్..!

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలను రెడీ చేస్తున్న ప్రభాస్, తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు‘స్పిరిట్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ చిత్రాన్ని మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ పూజా కార్యక్రమం తర్వాత ప్రభాస్‌కు సంబంధించి ఓ ఫోటోషూట్ కూడా జరిగిందని.. ఆయన లుక్‌ని కూడా మేకర్స్ లాక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ తన వెయిట్ తగ్గించుకున్నారు.

ఇక ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి 2026 నుంచి నిర్విరామంగా జరగబోతుందని తెలుస్తోంది. త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కొరియన్ నటుడు డాన్ లీ విలన్‌గా నటించనున్నాడని తెలుస్తోంది.

Exit mobile version