ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్

ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్

Published on Nov 9, 2025 7:00 AM IST

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఐతే, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ ను వేస్తున్నారు. ఈ సెట్ లో రెండు వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తారట. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ప్రభాస్ పై ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ అవుతాయట.

పైగా ఈ సీక్వెన్స్ ఈ సినిమా మొత్తానికే మెయిన్ హైలెట్ గా నిలిచిపోతుందట. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్‌ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని తెలుస్తోంది.

తాజా వార్తలు