‘లవ్ స్టోరీ’ షూటింగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !

‘లవ్ స్టోరీ’ షూటింగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jul 26, 2020 11:13 PM IST

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా వస్తోన్న ‘లవ్ స్టోరీ’ సినిమా కరోనా తగ్గిన తరువాతే షూటింగ్ కి వెళ్తుందని ఈ చిత్ర నిర్మాత నారాయణదాస్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అక్టోబర్ నుండి షూట్ అనుకున్నారు గాని, నిర్మాత మాటలు ప్రకారం ఇక వచ్చే ఏడాది షూటింగ్ ఉంటుంది.

కాగా ఈ సినిమా కాంబినేషన్ తో పాటు శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా లవ్ స్టోరికి పై భారీ అంచనాలకు కారణమైంది. దానికి తోడు క్రేజీ బ్యూటీ సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూతో ఆమె నటించడం ఇదే ప్రథమం కావడం, వీరి జోడీ పై ప్రేక్షకుల్లో బీభత్సమైన ఇంట్రస్ట్ ఉండటం సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.

ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ లవ్ స్టోరీతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. మరి నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావులకు నిర్మాతలుగా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను ఇస్తోందో చూడాలి.

తాజా వార్తలు