విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే తెలుగులో హీరోని ‘కథానాయకుడు’ అని.. విలన్ ని ‘ప్రతినాయకుడు’ అని పిలుస్తారు. అలాంటి విలన్ పాత్రల్లో రాణించడం అందరికీ సాధ్యం కాదు. కళ్లల్లో క్రౌర్యం తాండవించాలి. హావభావాలతో వికటాట్టహాసం చేయాలి. అందుకు తగ్గ భీకర రూపం ఉండాలి. అలాంటి ప్రతినాయక లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి ‘నీరజ్ యాదవ్’లో. అందుకే.. భోజపురిలో లీడింగ్ విలన్ గా ఇప్పటికే పేరు తెచ్చుకుని, హిందీలోనూ విలన్ గా తనదైన ముద్ర వేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ ఈయన స్వరాష్ట్రం. అయితే.. తాను ఏ భాషలో నటిస్తున్నా.. అక్కడివాళ్ళు తనను ‘నువ్వు తెలుగువాడివా?’ అని అడుగుతుంటారని.. తన ఫేస్ కట్స్ అలా ఉంటాయని అంటుంటారని.. అందుకే తెలుగులో విలన్ గా మెప్పించాలని ఆశ పడుతున్నానని నీరజ్ యాదవ్ చెబుతున్నారు. ఒక ప్రముఖ దర్శకుడి పిలుపు మేరకు.. ఆడిషన్స్ కోసం హైద్రాబాద్ వచ్చిన నీరజ్ యాదవ్.. నేపాలీ, గుజరాతీ భాషల్లోనూ నటించారు. థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో సాయికుమార్, షియాజీ షిండే తదితరులతో రూపొందుతున్న ఓ కన్నడ చిత్రంలోనూ నటిస్తున్న నీరజ్ యాదవ్.. సినిమాలను ప్రేమించే, ప్రతిభను ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులంటే తనకు చాలా గౌరవమని, వాళ్ళ మెప్పు పొంది తెలుగులో ‘మంచి విలన్’గా స్థిరపడాలన్నది తన కోరికని చెబుతున్నారు!!
విలన్ గా విజృంభించే అవకాశం కోసం నిరీక్షిస్తున్న నీరజ్ యాదవ్ !
విలన్ గా విజృంభించే అవకాశం కోసం నిరీక్షిస్తున్న నీరజ్ యాదవ్ !
Published on Jan 31, 2020 7:45 AM IST
సంబంధిత సమాచారం
- ‘మిరాయ్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఎపిక్ వరల్డ్ పరిచయం అప్పుడే..!
- ‘పెద్ది’ పై లేటెస్ట్ అప్డేట్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- ‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!