పవన్ లేటెస్ట్ లుక్ పై నయా చర్చ.!

అసలు చాలా కాలం విరామం అనంతరం స్టార్ట్ చేసిన సినిమానే “వకీల్ సాబ్” దాదాపు రెండున్నరేళ్లు తర్వాత స్టార్ట్ చేసిన సినిమా కావడంతో పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ అసలు కరోనా మరో పెద్ద బ్రేక్ వేసింది. దీనితో ఈ చిత్రం మరింత ఆలస్యం అయ్యింది. ఇక ఇదిలా ఉంటే మిగిలి ఉన్న కాస్త షూట్ కు గాను పవన్ మళ్ళీ పాత లుక్ లోకి వచ్చారు.

షూట్ లో కూడా పాల్గొన్నారు. ఇక ఇదిలా ఉంటే మళ్ళీ బ్రేక్ ఇచ్చి ఆ లుక్ కూడా మార్చేశారు. వకీల్ సాబ్ కు ట్రిమ్డ్ లుక్ లో ఉన్న పవన్ ఇప్పుడు క్లీన్ షేవ్ లోకి రావడంతో తాను ఈ చిత్రంతో పాటుగా క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ ను కూడా లైన్ లో పెట్టారు. కానీ దాని కోసం మాత్రమే క్లీన్ షేవ్ లుక్ కావాల్సి ఉంది. ఇప్పుడు ఆ లుక్ లోకే మారడంతో అదే సినిమా కోసం అని అనుకోవచ్చు కానీ “వకీల్ సాబ్” లో ఇంకా బ్యాలెన్స్ షూట్ కాస్త మిగిలి ఉంది.

ముఖ్యంగా పవన్ మరియు శృతి హాసన్ లపై సన్నివేశాలు కూడా ఉన్నాయి. మరి బహుశా అందుకోసమా లేక క్రిష్ తో సినిమా కోసమా అన్నది తెలియాల్సి ఉంది. అయితే పవన్ ఎప్పుడు కూడా కూడా తన లుక్ పట్ల స్పెషల్ కేర్ తీసుకొంది లేదు. కేవలం సినిమాల కోసమే అప్పుడప్పుడు చిన్న చిన్న మార్పులు చేస్తుంటారు. అలాంటిది ఓ సినిమా చేస్తుండగానే మరో లుక్ లోకి మారడంతో మళ్ళీ సుదీర్ఘ గ్యాప్ తీసుకున్నారా లేక వెంటనే షూట్ లో పాల్గొంటారా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version