నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “సరిపోదా శనివారం” తో సాలిడ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత నాని హిట్ 3 అలాగే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో “ది ప్యారడైజ్” చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి లేటెస్ట్ గానే ప్యారడైజ్ కోసం నాని బీస్ట్ లుక్ లోకి కూడా సిద్ధం అవుతున్న జిమ్ ఫోటో సోషల్ మీడియాలో మంచి వైరల్ గా కూడా మారింది.
ఇక లేటెస్ట్ గా ఈ సినిమా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని అందించారు. కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు అనౌన్స్ చేసేసారు. దీనితో నానితో అనిరుద్ జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత ముచ్చటగా ఇది మూడో సినిమా అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా సబ్జెక్టు కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేయగా అనిరుద్ దీనికి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.