ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా, ‘దేవర పార్ట్-2’ ఉండబోతుంది అని రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఎలాగూ వార్ 2 కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు మరి ‘దేవర 2’ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అంటూ ఫ్యాన్స్ చూస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ ఫుల్ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి వినిపించాడని తెలుస్తోంది.
దేవర 2 షూట్ పై ఇంకా అధికారిక అప్ డేట్ రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్‌గా మారింది. అన్నట్టు ఈ పార్ట్ 2 కోసం పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.