మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కూడా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, వెంకీ – చిరు కోసం అనిల్ రావిపూడి ఓ స్పెషల్ కామెడీ ఎపిసోడ్ ను డిజైన్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ కోసం యాక్షన్ తో కూడుకున్న ఈ కామెడీ ఎపిసోడ్ ను డిజైన్ చేశారట. సినిమా మొత్తంలోనే ఈ ఎపిసోడ్ హైలైట్ గా ఉండబోతుందట.
పైగా ఈ ఎపిసోడ్ లో పాత పాటలను కూడా సందర్భానికి తగినట్టు ఫన్నీగా మలిచారు అని తెలుస్తోంది. అన్నట్టు ఈ ఎపిసోడ్ లో రాజేంద్రప్రసాద్ పాత్ర కూడా హైలైట్ గా ఉంటుందట. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.
