పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 12న, 2025న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది, పవన్ కళ్యాణ్ ఈ వారం ఎండింగ్ నుంచి ప్రమోషన్స్ లో పాల్గొంటారని, కాకపోతే రెగ్యులర్ ప్రమోషన్స్ లా కాకుండా సినిమా గురించి పవన్ చేత ప్రత్యేక ఇంటర్వ్యూలను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ వారం ముందు నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ ను దూకుడుగా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అన్నట్టు డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే