ప్యాచ్ వర్క్ పై అనిల్ రావిపూడి ఫోకస్ ?

Mana-Shankara-Vara-Prasad-G (1)

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే వారం నుంచి క్లైమాక్స్ లోని ప్యాచ్ వర్క్ ను షూట్ చేయడానికి అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షూట్ లో మెగాస్టార్ తో పాటు మిగిలిన తారాగణం కూడా జాయిన్ అవుతుందట. ఇక ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది.

కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు నచ్చిందని చిరు ఆల్ రెడీ చెప్పారు. అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్‌ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.

Exit mobile version