గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు సానాతో “పెద్ది” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కాకుండా చరణ్ నుంచి మరిన్ని సినిమాలు టాప్ దర్శకులతో రానుండగా ఈ సినిమాల్లో లేటెస్ట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా భారీ ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంది. అయితే పెద్ది సినిమా తర్వాత ఆల్రెడీ చరణ్ సుకుమార్ తో తన కెరీర్ 17వ సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే.
సుకుమార్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా కాకుండా చరణ్ నెక్స్ట్ గా త్రివిక్రమ్ తో చేస్తాడని ఇపుడు ఫ్రెష్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి కానీ చరణ్ లైనప్ లో ఇలా ఏం జరిగేది లేదట. మొదట సుకుమార్ తో సినిమానే ఉంటుంది అని ఆ తర్వాతే త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది అని తెలుస్తుంది. సో చరణ్ లైనప్ పరంగా ఆ రూమర్స్ లో నిజం లేదని చెప్పొచ్చు.