ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా వరుస విజయ చిత్రాల దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే మాస్ ఎంటర్టైనర్ చిత్రంని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంకో నెలలో ఈ చిత్రం తాలూకా షూటింగ్ యూఎస్ లో మొదలు కానుంది.
అయితే ఇంకా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి షూట్ మొదలు కాక ముందే అప్పుడే మహేష్ బాబు మ్యానియా మొదలయ్యిపోయినట్టు టాక్ వినిపిస్తుంది. జస్ట్ ప్రీ లుక్ పోస్టర్ అలాగే మోషన్ పోస్టర్ టీజర్స్ తోనే భారీ అంచనాలు ఈ చిత్రం నెలకొల్పుకుంది. అయితే ఇవి వచ్చి చాలా కాలం అయ్యింది.
కానీ ఇప్పుడు షూటింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ విషయంలో పలు ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు భాషల్లో మరియు శాటిలైట్ హక్కుల పరంగా భారీ స్థాయి బిజినెస్ మొదలయ్యిపోయింది అని టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా అన్ని భాషల్లో అన్ని హక్కులు కలుపుకొని 100 కోట్లకు పైగానే ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే మహేష్ సినిమాలు భారీ స్థాయి బిజినెస్ తో పాటు అదిరిపోయే వసూళ్లను కూడా రాబడతాయని చూసాము. ఇపుడు ఈ చిత్రానికి ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే ఈ టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటెర్టైన్మెంట్స్ వారితో సంయుక్తంగా మహేష్ నిర్మిస్తున్నారు.