వకీల్ సాబ్ విడుదల పై కొత్త రూమర్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ఈ ‘పింక్’ తెలుగు రీమేక్ పై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 14న పెద్ద ఎత్తున ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే కరోనా పెరుగుతున్న దృష్ట్యా పవన్ లాంటి పెద్ద హీరో సినిమాని థియేటర్ లో రిలీజ్ చేస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత మంచింది కాదు అని పవన్ ఫీల్ అవుతోనట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కరోనా పెరుగుతున్న క్రమంలో తన సినిమా థియేటర్ లో విడుదల చేసే విషయంలో పవన్ ఆలోచనలో పడ్డాడట.

ఇక ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి పవన్ ఫ్యాన్స్ కి ఒక అనుమానం ఉంది. ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, మరి ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడానికి ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయో అని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా పవర్ స్టార్ రీఎంట్రీతో టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ అవ్వడం గ్యారంటీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే పవన్ శైలి నటనను మరోసారి వెండితెరపై చూడాలనే ఫ్యాన్స్ ఆశ కూడా ఈ సినిమాతో తీరుతుంది. ఇక ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు అలాగే పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్లు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారట.

Exit mobile version