“కేజీయఫ్ చాప్టర్ 2” టీజర్ పై లేటెస్ట్ గాసిప్స్?

“కేజీయఫ్ చాప్టర్ 2” టీజర్ పై లేటెస్ట్ గాసిప్స్?

Published on Nov 5, 2020 7:01 AM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా “కేజీయఫ్ చాప్టర్ 2”. దీనికి ముందుగా వచ్చిన చాప్టర్ 1 భారీ స్థాయిలో విజయాన్ని అందుకొనే సరికి దీనిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. ఇలా అన్ని హంగులు కలగలుపుకున్న ఈ భారీ చిత్రం నుంచి ఒక సరైన అప్డేట్ కోసం పాన్ ఇండియన్ వైడ్ గా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అదే ఈ చిత్రం తాలూకా టీజర్ కోసం. దీనిపై సరైన సమాచారం లేదు కానీ గాసిప్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ గా అయితే ఏకంగా వచ్చే ఏడాదిలోనే ఈ టీజర్ విడుదల అవుతుందనని టాక్ వినిపిస్తుంది. సంక్రాంతి సీజన్ కు ముందుగా జనవరి 8న విడుదల చేస్తారు అంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే అందుకు చాలానే గ్యాప్ ఉంది కాబట్టి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో అన్నది కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు