ప్రభాస్, హను ప్రాజెక్ట్ పై లేటెస్ట్ న్యూస్!

ప్రభాస్, హను ప్రాజెక్ట్ పై లేటెస్ట్ న్యూస్!

Published on Sep 19, 2025 7:01 AM IST

Fauji

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు చిత్రాల్లో యంగ్ హీరోయిన్ ఇమాన్వి నటిస్తున్న సినిమా కూడా ఒకటి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ లేని సన్నివేశాలు షూటింగ్ జరుగుతుండగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ మీకోసం తీసుకొచ్చాం.

ప్రస్తుతం బాలీవుడ్ వెర్సటైల్ నటుడు అనుపమ ఖేర్ పై ఓ ఇంట్రెస్టింగ్ సీన్ తెరకెక్కుతోందట. తనపై రైల్వే స్టేషన్ లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కుతున్నాయట. ఇక తన లుక్ కూడా ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉండనుంది అని సమాచారం. మొత్తానికి అయితే ఈ సినిమా పనులు కూడా చకచకా జరుగుతున్నాయని చెప్పాలి. అలాగే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు