‘ది రాజా సాబ్’ డబ్బింగ్ పై లేటెస్ట్ న్యూస్

‘ది రాజా సాబ్’ డబ్బింగ్ పై లేటెస్ట్ న్యూస్

Published on Jun 1, 2025 10:02 AM IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా ‘ది రాజా సాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా ప్రభాస్ జూన్ మొదటి వారం నుంచి డబ్బింగ్ చెప్పనున్నాడని.. అన్నట్టు తన పాత్రకు హిందీలో కూడా ప్రభాసే డబ్బింగ్ చెప్పనున్నారని… డబ్బింగ్ అనంతరం సినిమా ప్రమోషన్స్ లో టీమ్ బిజీ అవుతారని తెలుస్తోంది.

ఇక ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్విరామంగా జరుగుతుంది. అన్నట్టు ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు