‘అఖండ 2’ స్పెషల్ సాంగ్ పై కొత్త అప్ డేట్ !

‘అఖండ 2’ స్పెషల్ సాంగ్ పై కొత్త అప్ డేట్ !

Published on Sep 21, 2025 12:01 PM IST

Akhanda2

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. భాను మాస్టర్ కొరియోగ్రఫీలో 600 మంది డాన్సర్లతో ఓ మాస్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారని, దీని కోసం స్పెషల్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లో ఓ యంగ్ బ్యూటీ కూడా కనిపిస్తోందట. అన్నట్టు ప్రస్తుతం ఈ సినిమా ‘సీజీ మరియు విఎఫ్ ఎక్స్’ వర్క్ కూడా జరుగుతుంది.

కాగా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. తమన్‌ స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే స్పష్టం చేసింది. అన్నట్టు ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా టీజర్‌ ట్రెండ్‌ సృష్టించిన విషయం తెలిసిందే. అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు