యశ్ భారీ సినిమా రూమర్స్ పై క్లారిటీ.. ఆన్ టైం గ్యారెంటీ

యశ్ భారీ సినిమా రూమర్స్ పై క్లారిటీ.. ఆన్ టైం గ్యారెంటీ

Published on Oct 30, 2025 3:00 PM IST

Toxic

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ భారీ సినిమా ‘టాక్సిక్’ కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ అలా కొనసాగుతుంది. దర్శకురాలు గీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యశ్ కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడని అలాగే వచ్చే ఏడాది ఆన్ టైం రిలీజ్ కూడా ఉండకపోవచ్చు అనే రూమర్స్ మొదలయ్యాయి.

అయితే ఈ రూమర్స్ అన్నిటికీ ఇప్పుడు చెక్ పడింది. టాక్సిక్ సినిమాపై వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం అట. సినిమా అనుకున్నట్లుగా మార్చ్ 19నే గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తారట. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆన్ టైం రావడం పక్కా అని సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. సో అందరికీ ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు