వార్ 2′ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్!

వార్ 2′ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్!

Published on Jul 14, 2025 8:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “వార్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మరో నెల మాత్రమే సమయం ఉంది. ఇంకా ఈ గ్యాప్ లో చాలానే అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి. అయితే ఈ అప్డేట్స్ లో ట్రైలర్ కంటే ముందు ఫస్ట్ సింగిల్ పట్ల కూడా మంచి ఆసక్తి నెలకొంది.

అయితే వార్ 2 నుంచి ఫస్ట్ సింగిల్ గా ఒక రొమాంటిక్ సాంగ్ వస్తుందని బజ్ ఉంది కానీ ప్రస్తుతం ఈ సాంగ్ ఈ వారమే వస్తున్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా ఆల్రెడీ టీజర్ కి తన వర్క్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. వరల్డ్ వైడ్ గా ఆగస్ట్ 14న తెలుగు, హిందీ తమిళ్ భాషల్లో గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు