తారక్ నెక్స్ట్ పై లేటెస్ట్ బజ్.!

తారక్ నెక్స్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Jan 2, 2021 3:00 PM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అలాగే ఈ చిత్రం అనంతరం తారక్ మరికొన్ని సినిమాలను ఓకే చేసిన విషయం కూడా తెలిసిందే. మరి ఈ లిస్ట్ లో మొదటి వరుసలో ఉన్నది మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ప్లాన్ చేస్తున్న “అయినను పోయి రావలె హస్తినకు” చిత్రం ఉంది.

మరి దీనిపైనే లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని తారక్ సాధ్యమైనంత త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నాడట. అంతే కాకుండా ఇందులో కూడా తారక్ మేకోవర్ మళ్ళీ వేరేలా ఉంటుందని అంటున్నారు. దాదాపు అయితే మార్చ్ కల్లా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా గాసిప్స్ వినిపిసున్నాయి. ఇప్పటికే ఈ క్రేజీ కాంబో కోసం తారక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ ఎప్పటికి రెడీ చేస్తారో చూడాలి.

తాజా వార్తలు