పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !

పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !

Published on Aug 25, 2025 12:06 PM IST

OG Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజి కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఐతే, ఈ సినిమా అనుకున్నట్లు, ప్రకటించిన తేదీకి వస్తుందా? రాదా? అన్న ప్రశ్నలు వినిపిస్తూనే వున్నాయి. సినిమాకు ఇంకో నాలుగు రోజుల వర్క్ వుందని, ఆ వర్క్ లో హీరో పవన్ పాల్గొనాల్సి వుందని వార్తలు వస్తున్నాయి. అయితే, కేవలం రెండు రోజుల సాదా సీదా ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలిందని తెలుస్తోంది.

కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓజి సినిమా సెప్టెంబర్ మూడో వారంలో థియేటర్లలోకి వచ్చేస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు