మాస్ మహారాజ రవితేజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా కొత్త దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మాస్ జాతర”. మంచి అంచనాలు ఇది వరకు సెట్ చేసుకున్న ఈ సినిమా అలా ఆలస్యం అవుతూ వస్తుంది. నిజానికి ఈ ఆగస్ట్ లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా వేసినట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
మరి కొత్త డేట్ ఏంటి ఎప్పుడు అనేది ఇంకా బయటకి రావాల్సి ఉండగా దీనిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీనితో ఈ సినిమా అక్టోబర్ చివరలో కానీ నవంబర్ మొదటి వారంలో కానీ రిలీజ్ కి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించారు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.