మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే డ్రాగన్. అనధికారిక టైటిల్ అయినప్పటికీ అభిమానులు దీనికి ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమా షూటింగ్ కొంచెం గ్యాప్ ఇటీవల కొత్త షెడ్యూల్ మొదలైంది. మరి ఈ షూట్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది.
దీని ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న షూట్ అంతా ఈ నవంబర్ కి పూర్తి కానుండగా నెక్స్ట్ షెడ్యూల్ డిసెంబర్ లో శ్రీలంకలో మొదలవుతుంది అని వినిపిస్తోంది. సో ఆన్ టైం ఈ సినిమా వచ్చే ప్రక్రియలు కొనసాగుతున్నాయి అని చెప్పవచ్చు. ఇక ఈ భారీ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
