“ఆచార్య”లో చరణ్ కు సెట్టయ్యేది ఎవరో.?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని కొరటాల తన ట్రేడ్ మార్క్ లోనే కావాల్సినన్ని మాస్ ఎలిమెంట్స్ మరియు సామాజిక సందేశంతో తెరకెక్కిస్తున్నారు.

అయితే ఇప్పుడు పునః ప్రారంభం కావడానికి రెడీ అవుతున్న ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటించనున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ రోల్ కు కూడా ఒక ఫిమేల్ లీడ్ కూడా ఉంది.

అయితే ఈ రోల్ కు గత కొన్ని రోజుల నుంచి కియారా అద్వానీ పేరు వినిపించగా ఇప్పుడు సరికొత్తగా రష్మికా పేరు వినిపిస్తుంది. మరి ఈ ఇద్దరిలో చరణ్ కు ఎవరు సెట్టవుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి చిరు మ్యాజికల్ కాంబో మణిశర్మ సంగీతం అందిస్తుండగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

Exit mobile version