ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన ఆల్ టైం సెన్సేషనల్ హిట్ కాంబో బోయపాటి శ్రీను దర్సకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబో నుంచి వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో పాటుగా ఆ మధ్య బాలయ్య పుట్టియినరోజు కానుకగా విడుదల చేసిన టీజర్ తో ఒక్కసారిగా అంచనాలు మరింత స్థాయికి వెళ్లాయి. దీనితో ఈ సినిమా కోసం ఒక్క బాలయ్య అభిమానులే కాకుండా మాస్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాపై ఓ బజ్ బయటకొచ్చింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దాదాపు అన్ని పాటలను పూర్తి చేసేసినట్టు టాక్. అది కూడా ప్రతీ సాంగ్ కూడా అదిరిపోయేలా వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే టీజర్ లో థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందో తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే థమన్ సాంగ్స్ ను కూడా ఎక్కడా తగ్గకుండా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలయ్య లుక్స్ కు సంబంధించి కూడా పలు రూమర్స్ ఉన్నాయి.