ప్రభుదేవా ప్రేమ పెళ్లి.. నిజమేనా ?

ప్రభుదేవా ప్రేమ పెళ్లి.. నిజమేనా ?

Published on Nov 14, 2020 12:07 AM IST


ప్రముఖ కొరియోగ్రఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా వివాహం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆయన ప్రేమ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి భార్య రామలతతో మనస్పర్థల కారణంగా విడిపోయిన ప్రభుదేవా ఆ తర్వాత ఒక సౌత్ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారు. చాలారోజులు నడిచిన వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండానే మధ్యలోనే బ్రేక్ అయింది. ఆ బ్రేకప్ తర్వాత ప్రభుదేవా పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెట్టారు.

అయితే తాజాగా అయన మరోసారి ప్రేమలో పడ్డట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈసారి ఆయన ప్రేమించింది సెలబ్రిటీని కాదట.. తన బంధువుల్లోని అమ్మాయినేనట. ఆమె కూడ ప్రభుదేవా ప్రేమకు ఓకే చెప్పిందని, త్వరలోనే వీరి వివాహం జరుగుతుందని అంటున్నారు. అయితే ప్రభుదేవా మాత్రం ఇంకా ఈ వార్తలపై స్పందించలేదు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది కాలమే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ‘రాధే’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తాజా వార్తలు