రవితేజ సినిమాలో మెరవనున్న లక్ష్మీ రాయ్

Lakshmi-Rai

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘బలుపు’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాని జూన్ లో విడుదల చేయాలనుకుంటున్నారు.కొద్దిరోజులకు ముందు ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒక క్రేజీ హీరోయిన్ ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తోంది అని తెలియజేశాడు. ఆ హీరోయిన్ మరెవరో కాదు లక్ష్మీ రాయ్ . ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీవీపీ సినిమా బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి లక్ష్మీ రాయ్ స్పెషల్ అట్రాక్షన్ కానుందా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

Exit mobile version