ఇటీవలే విడుదలైన ‘కాంచన’ మరియు ‘అధినాయకుడు’ చిత్రాల్లో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ లక్ష్మీ రాయ్, ప్రస్తుతం తను నటించిన ‘వన యుద్ధం’ అనే కన్నడ చిత్రంలో అసలు గ్లామర్ కి అవకాశంలేని పాత్ర చేసారు. 2004 లో టాస్క్ ఫోర్స్ దాడిలో చనిపోయిన సాండల్ వుడ్ స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయత వశిస్ట్ అనే జర్నలిస్ట్ పాత్రని లక్ష్మీ రాయ్ పోషించారు. ఇప్పటి వరకూ పూర్తి గ్లామరస్ పాత్రలే చేసిన లక్ష్మీ రాయ్ ఇకనుంచి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలనుకుంటోంది. అందులో భాగంగానే విక్రమ్ హీరోగా నటించిన ‘తాండవం’ చిత్రంలోనూ మరియు ఇప్పడు చేస్తున్న ‘వన యుద్ధం’ చిత్రంలోనూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తున్నారు.
ఎ.ఎం.ఆర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘భీమిలి కబడ్డి జట్టు’ చిత్రంలో కబడ్డి కోచ్ గా కనిపించిన కిషోర్ వీరప్పన్ పాత్రని పోషించారు మరియు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీ పాత్రని విజయలక్ష్మీ చేసారు. వీరప్పన్ ని ఎన్ కౌంటర్ చేసిన డి.జి.పి విజయ్ కుమార్ పాత్రని యాక్షన్ కింగ్ అర్జున్ పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళనాడు మరియు కర్నాటక అడవుల్లో చిత్రీకరించారు.